Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మాయి స్నానం చేస్తుంటే పైశాచికానందం... తగిన శాస్తి!

  • హైదరాబాద్ మూసారంబాగ్ లో ఘటన
  • బాత్ రూమ్ కిటికీ నుంచి చూసిన శివకుమార్
  • అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపిన పోలీసులు
ఓ యువతి స్నానం చేస్తుండగా, తొంగిచూస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్న యువకుడికి తగిన శాస్తి జరిగింది. హైదరాబాద్, మలక్‌ పేట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మూసారంబాగ్‌ డివిజన్‌ పరిధిలోని సెవెన్‌ హిల్స్‌ అపార్ట్‌ మెంట్స్,  మూడో అంతస్తులో ఓ యువతి నివాసం ఉంటుంది. అదే ఫ్లోర్‌ లో ఫతేనగర్‌ కు చెందిన శివకుమార్‌ పిళ్లై (37) అటెండర్‌ గా పని చేస్తూ, నివాసం ఉంటున్నాడు. 26వ తేదీన యువతి బాత్‌ రూమ్‌ లో స్నానం చేస్తున్న వేళ, ఓ స్టూల్‌ సాయంతో బాత్‌ రూమ్‌ కిటికీని చేరుకున్న శివకుమార్, తొంగి చూశాడు. ఈ విషయాన్ని గమనించిన యువతి, పెద్దగా కేకలు వేయడంతో అతను పారిపోయాడు. ఎవరో తాను స్నానం చేస్తుంటే చూశారని ఆమె పోలీసులను ఆశ్రయించగా, వారు అపార్ట్ మెంట్ సీసీ ఫుటేజ్‌ లను పరిశీలించి, శివకుమార్‌ నిందితుడని తేల్చారు. దీంతో శివకుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్‌ కు తరలించారు.
Hyderabad
Bathroom
Malakpet
Police

More Telugu News